మధ్యతరగతి జీవి..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్" విన్నర్"

మధ్యతరగతి జీవి..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్" విన్నర్"

మధ్యతరతి జీవి..!
 
గాడిద కష్టం చేసినా.,
గుఱ్ఱపు స్వారీ చేసే భాగ్యం మరొకరికి..!
ఒకరి కష్టం వేరొకరికి సుఖం..!
పని చేసే వాడికి చీవాట్లు, తిట్లూ..!
అనుభవించేవాడు రాజు రారాజు..!
ప్రశ్నిస్తే..రాజు అనుకుంటే దెబ్బలకు కొదవా..!?? నన్నట్లు పరిస్థితి..
ఎవ్వరిని ఏమనకుండ ఉండాలి,బానిసలా బ్రతకాలి..!??
కేవలం పేరుకే ఉద్యోగి..!?
చేసేదంతా.. 
గులాంగిరి,వెట్టిచాకిరి..!???
జీతం కోసం జీవితం..!??
జీతం మీద ఆధారపడ్డ జీవితం..!??
గత్యంతరం లేని పరిస్థితుల్లో "జీవితం"..!??
జీవిక కోసం పాట్లు..?
ఎన్నెన్నో అనుభవాలు,అగచాట్లు..!??
ఆత్మాభిమానం 
ఎప్పుడో పోగొట్టుకుని పోయింది.,
అది ఉండలేక,ఇమడలేక 
దయచేసింది..!??
ఇంకెవరు వినేది..!
ఇంక తక్కువైన ట్లు..!??
ధరలన్ని ఆకాశానికి ఎగబాకాయి..!??
ఇక నలువైపుల చూస్తూ.. మధ్యతరగతి కుటుంబ ఉద్యోగి ఆలోచనలో 
పడ్డాడు..!??

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్,
నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments