మామిడి పిక్కలు - మార్గం కృష్ణ మూర్తి

మామిడి పిక్కలు - మార్గం కృష్ణ మూర్తిమామిడి పిక్కలు

యేవేవో పండ్లను తింటుంటాం
ఎక్కడెక్కడో పారేస్తాం
ఎప్పుడో తిని పారేశారు
మామిడి పండ్ల పిక్కలను
మరిచి పోయారు చాలాకాలం

ఎండకు ఎండి
చలికి వణికి
వానకు తడిసి
అవి వసంత కాలంలో
పెరటిలో మొక్కలై మొలిచాయి
నిజంగా అది అదృష్టమే
గుర్తుకొచ్చాయి మామిడి పిక్కలు
అవి బంగిన పల్లి మామిడి పళ్ల మొక్కలు

గోతులు త్రవ్వే
విడి విడిగా నాటే
నీరు ఎరువు వేయసాగే
చుట్టూ కంచెను నాటే
పెరిగి పెద్దాగాయే కాలక్రమేనా
పూతా కాతా మొదలాయే

వృక్షాలు మహావృక్షాలాయే
ఆకులు పచ్చతోరణాలుగా
పండుగలకు పెళ్ళిళ్ళకు
ఎండిన కొమ్మలు వంటకు
ఫలాలను ఇంటిల్లి పాది తినుటకు
బంధు మిత్రులకు ఇచ్చుటకు
మిగిలినవి అమ్ముటకుపయోగపడే
తిని పారేసిన మామిడి పిక్కలు
కాస్త శ్రమిస్తే , కాస్త దృష్టి పెడితే
ఇంట సిరులను కురిపిస్తుండటం
లక్ష్మీ ప్రధమే కదా
శుభ పరిణామమే కదా

- మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments