వందేమాతరం ---సి. శేఖర్(సియస్సార్)

వందేమాతరం ---సి. శేఖర్(సియస్సార్)

వందేమాతరం

వందేమాతరం 
ప్రతి భారతీయుడి గుండె పలికే 
మరపురాని మరువలేని సమరశంఖారావం
తెల్లోడి గుండెల్లో గుణపమై గుచ్చుకున్న స్వచ్ఛమైన
స్వతంత్య్రకాంక్ష 
అడుగుఅడుగున అందరిలో
నవోత్సోహ తేజస్సు నింపిన వెలుగురేఖ వందేమాతరం
ధైర్యంగా ముందడుగేయించిన 
మండే మనుషులనేకంచేసిన
మనసు నినాదం 
మువ్వన్నెలజెండై ఎగిరిన స్వతంత్ర సమరం వందేమాతరం 
తరమేదైనా తరగని  
ఐక్యతాగీతం వందేమాతరం

సి. శేఖర్(సియస్సార్)
పాలమూరు,
9010480557.


0/Post a Comment/Comments