శీర్షిక:పెద్దల పలుకులు భవితకు వెలుగులు (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

శీర్షిక:పెద్దల పలుకులు భవితకు వెలుగులు (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

*శీర్షిక:పెద్దల పలుకులు భవితకు వెలుగులు

మనిషి ఎదిగే కొద్దీ వదగాలి
వొదుగు తూ ఎదగాలి
ఉన్నత స్థితికి చేరాలి
జీవితం సఫలం చేయాలి

విజయం పొందిన వెంటనే ఊరుకోకు
ఉత్సాహం తో పరుగులు తీయు నువు ముందుకు
బద్ధకానికి స్వస్తి పలుకు
ఇంకా విజయాలు ముందర నీ కొరకు

సాధించు సాగించు సాఫీగా ఎదుగుతుండు
వెనుకున్న వారికి చేయూత నిస్తుండు
కాలం తో పరుగిలిడుతుండు
ఎప్పటికప్పుడు ఒకసారి గమనిస్తుండు

కాదు పరచిన విస్తరి జీవితం
కాదు పూల పాన్పు జీవితం
కాకూడదు చిరిగిన విస్తరి జీవితం
కాకూడదు వాడిపోయే మోడు జీవితం

అందమైన పూదోట మన జీవితం
ఆపూదోటలో పుష్పమే మన జీవితం
పుష్పాలన్నీ సుగంధాలను వెదజల్లినట్లు
మన జీవితం కూడా విజయ సుగంధాలను వెదజల్లాలి

పుట్టుక సామాన్యం కావొచ్చు
మరణం అసమాన్యం కాకూడదు
పుట్టుక లో చరిత్ర లేకపోవచ్చు
గిట్టుట చరిత్ర కావాలి 

ఇవే అబ్దుల్ కలాం గారి పలుకులు
నీ ఉన్నతి కి వెలుగులు
పెద్దల పలుకులు
భవితకు వెలుగులు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
            విజయనగరం జిల్లా
            9441530829

ఇది నా స్వీయారచన. హామి ఇస్తున్నాను.

0/Post a Comment/Comments