"వీరులకు వందనాలు" మీసాల సుధాకర్

"వీరులకు వందనాలు" మీసాల సుధాకర్

మీసాల సుధాకర్
ఖిలాషాపురం
జనగామ జిల్లా
9908628430

వీరులకు వందనాలు

తెల్లవారినెదిరించగ
సంకెళ్లను తొలగించగ
పోరాటం చేసినారు
స్వాతంత్రం తెచ్చినారు

ఎందరో వీరులప్రాణము
తమజీవిత సర్వస్వము
జాతికొరకు ఇచ్చినారు
త్యాగమునే చేసినారు

భరతమాత స్వేచ్చకొరకు
బానిసత్వ విముక్తికొరకు
ఆంగ్లేయులనేదిరించి
అమరత్వం పొందినారు

మనవవీరుల గొప్పతనం
చూపించిన ధైర్యగుణం 
జాతిజనులు తెలుసుకొని
వందనాలు తెలపాలి

0/Post a Comment/Comments