వజ్రోత్సవం (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

వజ్రోత్సవం (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

వజ్రోత్సవం

ఉత్సవం ఉత్సవం 
ఇది స్వాతంత్రయోత్సవం
మన భారత స్వాతంత్ర్య దినోత్సవం
ఇది వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవం

భరతమాత కు బ్రహ్మోత్సవం
భారతీయులకు వజ్రోత్సవం
భారతజాతి బానిస విముక్తి ఉత్సవం
భారతీయుల బ్రహ్మాండ స్వాతంత్రయోత్సవం

వీరపుత్రుల వీరోచిత పోరాటతత్వం
స్వాత్రంత్య్ర యోధుల ధీరుల ధీరత్వం
నిస్వార్ధమైన త్యాగజీవుల మహోన్నతత్వం
దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరత్వం

ఎన్నెన్ని చెప్పను ఏమని చెప్పను
మహోన్నత చరిత గల భాగ్యోదయ దేశం
అభ్యుదయ వాదుల సంఘసంస్కర్తల ఆదర్శ దేశం
సమ సమాజ నిర్మాణానికి నడుం బిగించిన నవభారతం నా దేశం

ధన కనక వజ్ర వైఢూర్యముల తో బాసిల్లిన దేశం
సత్కర్మలకు సత్యధర్మ శాంతి ప్రేమలకు నిలయం నా దేశం
వేదాలు ఇతిహాసాలు భగవద్గీత లను ప్రభోధించిన హిందూదేశం
ప్రపంచ చరిత్ర పుటలలో స్వర్ణాక్షరాల తో లిఖించ బడిన దేశం నా భారత దేశం

జయహో భారత్
మేరా భారత్ మహాన్
జైజవాన్ జైకిసాన్
వందేమాతరం జైహింద్

రచన  పసుమర్తి నాగేశ్వరరావు
            టీచర్ సాలూరు
            విజయనగరం జిల్లా
            9441530829

0/Post a Comment/Comments