గిడుగువారి జయంతి
--------------------------
వ్యావహారిక భాష
పాపలాగ అందము
జుంటితేనె మాదిరి
నోటికదే మధురము
కోకిల గానంలా
శ్రావ్యమైనది తెలుగు
వెన్నెల చల్లదనము
భాషలందున వెలుగు
గిడుగువారి జయంతి
'తెలుగుభాష' వేడుక
వాడుక భాష అమలు
విజయోత్సవ గీతిక
తెలుగుభాష వృద్ధికి
చేయిచేయి కలుపుదాం
శ్రీ గిడుగు రామ్మూర్తి
కృషికి ప్రణమిల్లుదాం
--గద్వాల సోమన్న,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు,
ఎమ్మిగనూరు.
Post a Comment