రక్షణ బంధం (పసుమర్తి నాగేశ్వరరావు సాలూరు టీచర్)

రక్షణ బంధం (పసుమర్తి నాగేశ్వరరావు సాలూరు టీచర్)

రక్షణ బంధం

ఒకే కొమ్మలో రెమ్మలు
ఒకే తల్లి బిడ్డలు
ఒకే ఒరలో బంధాలు
అవే రక్షా బంధాలు

అమ్మా నాన్నలో సగం
అన్న గా ఒక భాగం
చెల్లె కోసం త్యాగం
అదే ప్రేమానురాగం

ఒకే పేగు బంధం
ఒకే రక్త బంధం
ఒకే అనురాగబంధం
అదే రక్షా బంధం

కంటిపైన రెప్పలా
కలకాలం తోడులా
వెన్నంటి నీడలా
వుంటారు ప్రాణం లా

ఒకరికి ఒకరు ఊత
జీవితాంతం చేయూత
దేవుడు గీసిన గీత
బ్రహ్మ రాసిన రాత

చేతిలో చేయి వేసి
ప్రేమను ఒలకబోసి
జీవితం దారవోసి
కాపాడు రక్షణ వేసి

అన్నయ్యే సర్వం
అదే రక్షణ పర్వం
మన జీవన పర్వం
రక్షాబంధన్ పర్వం

కల్మషం లేని ప్రేమ
కలకాలమైన ప్రేమ
కలిసి మెలిసిన ప్రేమ
కడవరకు ఉన్న ప్రేమ

ఈ రాఖీ బంధం
చెప్పలేని అనుబంధం
మానవ సంబందం
సోదరుల రక్షా బంధం

అన్నలు చెల్లెళ్ళు కి
అక్కలు తమ్ముళ్లకి
ఒకరంటే ఒకరకి
భరోస జీవితానికి

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా


0/Post a Comment/Comments