దీన బంధు..!(కవిత) ---ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

దీన బంధు..!(కవిత) ---ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

దీన బంధు..!(కవిత)

మనిషన్నాక మనసుండాలి..!
మంచి మనస్సు 
స్వంతం కావాలి..!
దీనులను చూసి చలించాలి..!
కరుణరసం, 
మదిలో పెల్లుబకాలి..!
అభాగ్యుల పట్ల 
జాలిని కురిపించాలి..!
సహాయాన్ని అందించాలి..!
మంచి యన్నది 
మదిలో పుట్టాలి..!
ఇతరుల బాధను 
తనదిగా భావించే మనసు గా అవతరించాలి..!?
అంతో, ఇంతో..
ఎంతో, కొంత..
సాయపడే, 
సుగుణం ఉండాలి..!
సాటి సంఘజీవి ననే 
స్పృహ ఉండాలి..!
దేహాలు వేరైనా..
బంధుత్వాలు లేకున్నా..
కేవలం" మానవత్వం" 
నన్న వాస్తవాన్ని 
మరువకుండా, 
ఆదుకోవడం నేర్చుకోవాలి..!
అప్పుడే" దీన బంధువు" గా గుర్తించ బడతారు..! 

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments