తెలుగు భాష
అమృత కలశంబు
దేశభాషలందు
తెలుగు ఘనంబు.
అమ్మభాషయే
అమృతకలశంబు
త్యాగయ్య గొంతులో
తారాడునాదంబు
తిక్కన్న కలంలో తియ్యంధనంబు
ఆంధ్ర చక్కెర కేళి తెలుగు
కోనసీమ నారికేళి తెలుగు
రాయలసీమ ఉగ్గాణి తెలుగు
తెలంగాణ మాగాణి తెలుగు
తెలుగుభాషకు
పట్టాభిషేకం చేసే
అక్షర ప్రేమికులకు
హర్ధిక తెలుగు భాష
దినోత్సవ శుభాకాంక్షలు
రచన: మోటూరి నారాయణరావు
వృత్తి : జర్నలిస్టు
ఊరు :హైదరాబాద్
చరవాణి : 9346250304
Post a Comment