రామప్ప వైభవం - యునెస్కో గుర్తింపు

రామప్ప వైభవం - యునెస్కో గుర్తింపు

- మార్గం కృష్ణ మూర్తి
అంశం: "రామప్ప వైభవం - యునెస్కో గుర్తింపు:"
స్వరాలు:

01.
రామప్పలోన మహేశ్వరుడు
చురుకుగున్న నందీశ్వరుడు
గుడిని కట్టెంచెను రుద్రుడు
దేశ దేశాల  కీర్తి  పొందాడు

02.
కాకతీయుల కళానైపుణ్యం
నక్షత్రరూపమున నిర్మాణం
అపురూపమైన ఆ సౌందర్యం
సప్తస్వరాలు పలికే శిల్పం
అద్భుతమైనట్టి దేవాలయం

03.
నృత్య శిల్పాలకు కొలువైంది
రామప్ప దేవాలయం నచ్చింది
నిర్మాణం ప్రపంచం గుర్తించింది
యునెస్కోచే గుర్తింపును పొంది
భారత దేశం పులకించింది

04.
యునెస్కో గుర్తింపుకు కారణం
నిర్మాణం ఇసుకలో జర్గడం
నీట తేలే ఇటుక కట్టడం
రాతి  రంగు నేటికి ఉండటం
గుడి గోపురం మన్నికుండడం

05.
యునెస్కో గుర్తింపువలనొచ్చే
దేవాలయానికి నిధి వచ్చే
దేశానికి గొప్ప పేరు వచ్చే
పర్యాటకంగా గుర్తింపు వచ్చే
నా తెలంగాణకు కీర్తి తెచ్చే

06.
స్తంభాలపై నృత్య భంగిమలు
శిల్పాల వైభవ సౌందర్యాలు
గుడిలోన నిత్య వెలుగులు
రుద్రుడి కళా నిదర్శనాలు
విస్తరిస్తుండే దేశ దేశాలు

మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్

0/Post a Comment/Comments