కాలంచేసే ఇంద్రజాలం...పోలయ్య కవి కూకట్లపల్లి, అత్తాపూర్, హైదరాబాద్.

కాలంచేసే ఇంద్రజాలం...పోలయ్య కవి కూకట్లపల్లి, అత్తాపూర్, హైదరాబాద్.

కాలంచేసే ఇంద్రజాలం...

శతృవుతో  పోట్లాడితే సమస్య
శతృవుతో మాట్లాడితే పరిష్కారం

ఈ జీవితం...సంద్రమైతే
సుఖసంతోషాలు జలచరాలైతే
వాటిని...పట్టుకోవాలంటే
కాలమనే...గాలాన్ని విసరాలి

ఈ జీవితం...విషాదభరితమైతే
కష్టనష్టాలు బాధలు భయాలు భూతాలైతే
వాటిని...తట్టుకోవాలంటే
కాలమనే...శూలాన్ని విసరాలి

కొందరు ప్రాణమిత్రులే బద్దశతృవులౌతారు
కొందరు బద్దశతృవులే ప్రాణమిత్రులౌతారు
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం

కొందరిని కాలం క్షణంలో చిత్రంగా కలుపుతుంది
కొందరిని కాలం క్షణంలో కౄరంగా విడదీస్తుంది
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఇద్దరు ఒక్కటౌతారు
రేపు విడిపోయి దూరమైతారు దుఖ్ఖితులౌతారు
కారణం ఒక్కటే కలికాలం విధిఆడే వింతనాటకం
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం

కాలం తల్లక్రిందులైతే భూగోళమంతా గందరగోళం
అందుకే ఎవరికీ అర్థంకాదు కాలంచేసే ఇంద్రజాలం
నిజమే కలిసివుంటే కలదు సుఖం ముందు ముందు
జీవితంలో తగిలే గాయాలకు కాలమే మంచిమందు

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502
 
0/Post a Comment/Comments