జీవిత సత్యాలు--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

జీవిత సత్యాలు--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

జీవిత సత్యాలు
-------------------------------
శాంతిలేని జీవితాలు
కాంతిలేని కాగితాలు
సంధి లేని కాపురాలు
చమురులేని చిరుదివ్వెలు

మూర్ఖులతోడ  స్నేహాలు
శిథిలావస్థ  శిబిరాలు
నాశనానికి చిహ్నాలు
ఆగమగు అనుబంధాలు

నిర్లక్ష్యం  చీడపురుగు
అభివృద్ధిలో వెనుకడుగు
చురుకుదనమే ముందడుగు
మనిషికది రక్షణ గొడుగు

దేవుడులేని జీవితము
జీవం లేని శరీరము
ఆధారముండని వృక్షము
వీక్షింప జీవచ్చవము

--గద్వాల సోమన్న ,
       ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments