మానవధర్మం ------డా. రామక కృష్ణమూర్తి

మానవధర్మం ------డా. రామక కృష్ణమూర్తి

మానవధర్మం
---డా.రామక కృష్ణమూర్తి


మనిషికి మనసే ముఖ్యం.
మనసే సర్వం,మనసే మూలం.
మెదడు దానికి ప్రాణం.
ఆలోచనలు సవ్యమైతే,
అమితమైన ఆనందం.
సంకుచితమైతే అనర్థం.
ఇతరులను బాధపెట్టే గుణం
అత్యంత ప్రమాదకరం.
బాధతో ఒకరేడుస్తుంటే
నవ్వడం అనేది దానవత్వం.
మానవుడు దానవుడు కారాదు.
మంచిని పంచి,స్నేహంతో మెలిగి,
జన్మసార్థకత చేసుకోవాలి.
మేలు చేయకున్నా,కీడు చేయొద్దు.
బతకాలి,బతకనివ్వాలి.
మెదడును మంచితో నింపాలి.
మానవుడిగా మెలగాలి.




0/Post a Comment/Comments