చల్లని సాయంత్రం..!(కవిత) ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

చల్లని సాయంత్రం..!(కవిత) ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

చల్లని సాయంత్రం..!(కవిత)

ఈ చల్లని సాయంత్రంలో, 
ఈ చల్లని గాలులు మధురమైన, 
సంగీతాన్ని వీనుల విందు చేస్తున్నాయి..!
ఎన్నో సంతోషాలు, 
మదిలో పుట్టిస్తున్నాయి..!
మదిలోని ఎదారును 
దూరం చేస్తూ,
హాయి గొలుపుతున్నాయి..!
ఆ పక్షులు సైతం అందంగా ఎలా కనిపిస్తున్నాయి..!??
రెక్కలు ఊగిస్తూ,
గాలిలో ఎలా చక్కర్లు, కొడుతున్నాయి..!
ఆహా.. ఏమేమి మధురాతి మధురమైన పాటలు గుర్తుకొస్తున్నాయి..నాకు,
ఆహా ..నా స్వరం ఈ చల్లని సాయంత్రపు గాలుల్లో,
ఎంత మంచిగా.. రాగయుక్తంగా.. మారినది..!?? ఆహా..
ఆ చెట్ల పైన పక్షుల కూతలు, కిచ కిచలు..!?
ఇండ్లకు చేరినట్టు ఆ చెట్ల పై పక్షుల పోట్లాటలు, గూళ్ళల్లో  
నిదురించడాలు..!??
అందమైన ప్రకృతిలో, అందమైన దృశ్యాలు మదిలో నిక్షిప్తమై ఉన్నాయి..!
సాయంత్రపు నడక కొనసాగుతోంది..!
ఆస్వాదన,అనుభూతి నీడలా సాగిపోతోంది..!
అంతా చల్లని సాయంత్రపు మాయ..!?

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments