శీర్షిక:మానవత్వం శ్రీమతి సత్య మొం డ్రేటి

శీర్షిక:మానవత్వం శ్రీమతి సత్య మొం డ్రేటి


అంశం:మానవత్వం
శీర్షిక: మానవ హితం

మానవత్వం అంటే ఏమిటి..
ప్రశ్నించాను సమాజాన్ని..
మానవ కష్టసుఖాల్లో నేనున్నానని చెప్పే ఆసన్న హస్త మే మానవత్వం.... కాని
అవి వేదికలెక్కిన ఉపన్యాసాలలో
కవులు రాసే కవితల్లో
రచయితల కథలలో మాత్రమే
గోచరిస్తున్నాయి....
నడిరోడ్డు న మనిషి ప్రమాదం లో చిక్కుకుంటే ఆసరా కోసం
చూస్తుంటే .....
తనకు పట్టనట్లు నడయాడే నరుడిలో ఉందా మానవత్వం?
ఆకలితో పిడికెడు అన్నం కోసంకోసం‌‌.. పరితపించే
అభాగ్యులకు సహృదయంతో
ఆకలి తీర్చే మహానుభావులు ది మానవత్వం...
మానవత్వమే బ్రతికి ఉంటే ఏ దేశంలో నైనా అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు
వృద్ధి చెందవు
ప్రతి వ్యక్తి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే అదే గొప్ప మానవత్వం...
లంచగొండితనం, దొంగతనం, దగా, వంచన, మోసం, మానవజాతికి పట్టిన రుగ్మతలు....‌‌. వాటిని నిర్మూలిస్తే... మనిషి మహనీయుడు అవుతాడు...
దేశ సౌభాగ్యానికి తోడ్ప డతాడు ....
మానవత్వం మనిషిలోని గొప్ప సుగుణం .... స్పందించే గుణం ఎదుటి వారి కష్టాలను తన కష్టాలు గా భావించి బాధ్యత పంచుకునే పరోపకారి....
"సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్' మహాకవుల ప్రబోధాన్ని అనుసరించి నడవాలి మనం
చిన్న ఉపకారానికి  పెద్ద సమాచారం పత్రికలలో దూరదర్శన్ లలో ప్రకటనలు మీ వే గొప్ప మానవత్వం గల మనుషులమని పేరు కోసం ప్రగల్బాలు.  .. మానవత్వం ఉన్న మనిషి తను చేసిన ఉపకారాన్ని ప్రదర్శించు కోడు... ఆయన . సహాయాన్న...అందుకున్న వాళ్లు చెప్పుకోవాలి....లేదు ఈనాడు......అలాంటి వారు ..
మీ ఎక్కడో ఒక చోట పుణ్యమూర్తులు ఉన్నచోట మానవత్వం మిగిలే ఉంటుంది... ఉంటారు మానవ హితం కోరి మానవత్వమే మనిషి మతం గా మసి లే మహానుభావులు... సర్వేజనా సుఖినోభవంతు....

పేరు: శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు: హైదరాబాద్
చరవాణి 9 4 9 0 2 3 9 5 8 1
ప్రక్రియ వచనం

0/Post a Comment/Comments