"బడిపంతులు" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

"బడిపంతులు" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

బడిపంతులు

బతకలేని బడుగు బడిపంతులు
బతుకు నేర్పే పంతులు
ఆర్ధిక స్తొమతలో పేద కావచ్చు
సాధనలోనూ ఆలోచనలోనూ కాదు
వృత్తిలో చిన్న వృత్తే కావచ్చు
కానీ ఉన్నతమైనది
జీతభత్యాలు తక్కువ కావచ్చు
జీవించడంలో కాదు
బడిపంతులని చిన్నచూపు వద్దు
పిల్లల భవిష్యత్తుని దిద్దే పంతులు
భావి భారత పౌరులుగా తీర్చే పంతులు
ఆడంబరం లేని జీవితం కావచ్చు
ఆశాజ్యోతిని వెలిగించే పంతులు
అదనపు ఆదాయం లేని బతుకు కావచ్చు
ఆనందంగా జీవించే బతుకు
ఆదర్శంగా నిలిచే బతుకు
బడి పంతుల ఆలోచనలు
పిల్లలకు వజ్రాయుధాలు
ఉపాధ్యాయుల మంచి మాటలే
విద్యార్థులకు చిరకాలం నిలిచే
శిలాశాసనాలు,వేదవాక్కులు
పంతులు బోధించే బోధనాలే
పిల్లలకు అమృత పానీయాలు
పిల్లల ఆశయాలే
ఉపాధ్యాయులకు అన్నప్రసాదాలు
విద్యార్థులు లక్ష్య సాధనే
పంతుల సంతోష సంద్రం
విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దడమే
బడి పంతుల లక్ష్యం


ఆచార్య ఎం. రామనాథం నాయుడు , మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments