రాఖీ బంధం ---సత్య

రాఖీ బంధం ---సత్య



కంటికి రెప్పలా,కన్న తండ్రి లా
కాపాడేది అన్నై తే....
ఆ కంటి కి పాపలా, కన్న తల్లిలా
అనురాగాన్ని పంచేది చెల్లి..
చెల్లెలి సుఖ - సంతోషాలు
అన్నకి అష్టైశ్వర్యాలైతే..
అన్న ఆదరాభిమానాలే చెల్లికి
తరగని నిధులు....
అన్నయ్యకి చెల్లి బాధ్యతైతే
చెల్లి కి అన్నే బలం - బలగం
ఆకలి వేళ చెల్లికి ఆ అన్నే అన్నమైతే...
అలసిన వేళ ఆ చెల్లే అన్నకు ఆలంబన...
అన్నైనా...తమ్ముడైనా
తన అక్కకైనా..చెల్లికైనా
ఇవ్వగలిగేది.... " సదా నీకు నేనున్నాను"
అనే నమ్మకం.
అక్కైనా..చెల్లైనా తన
అన్నకైనా.. తమ్ముడికైనా ఇవ్వగలిగేది...
" సదా నీకు అమ్మనై ఆప్య్యాయతని పంచిస్తాను" అనే నమ్మకం.
ఈ నమ్మకాల సమాహారమే
ఈ రాఖీ బంధము...
రక్షా బంధము...!!!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
 

0/Post a Comment/Comments