శీర్షిక:శ్రావణమాసం కళ (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

శీర్షిక:శ్రావణమాసం కళ (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

శీర్షిక:శ్రావణమాసం కళ


శ్రావణ శోభలు సంతరించుకున్నాయి
శ్రావణమాస పూజలు జరుగుతున్నాయి
ప్రతి ఇంటా లక్ష్మి కళలు ఉట్టిపడుతున్నాయి
మహిళల మోములలో ఆనందాలు వెల్లు విరుస్తున్నాయి

నోములు వ్రతాలు శుభకార్యాలు తో
పచ్చని పందిళ్లు ముంగిళ్లు ముగ్గులతో
పట్టు పరికిణీలు పట్టు చీరలు దరియించిన అందాలతో
ముచ్చట గౌపుతున్నాయు

ఆషాఢమాసపు శోభ అంతరించి
శ్రావణ శోభ సంతరించి
కొత్త దంపతుల మనసులు పులకరించి
కొత్త ఆశలు చిగురిస్తున్న శుభవేళ

శ్రావణ మేఘాల సందడి తో
అన్నదాతల ఆనందాల తో
పచ్చని పొలాలకు నారు పూతతో
కళ కళ లాడుతున్న ఆనందపు వేళా

ప్రతి ఇల్లు ఒక శుభగృహమై
ప్రతి ముతైదువ శుభ ప్రదం గా ముస్తాబై
ప్రతి తెలుగింట ఆనందాల పంటలై
శ్రావణమాసం అందాలు ఆరబోస్తున్న శుభవేళ

మామిడి తోరణాలతో కొబ్బరి ఆకుల పందిళ్ళతో
రక రకాల పూల తోరణాలతో
ముచ్చట గొలిపే రంగవల్లికలతో
లక్ష్మీదేవి సాక్షాత్కరించు శ్రావణ శుభవేళ


రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా
           9441530829

ఇది నా స్వీయారచన. హామి ఇస్తున్నాను

0/Post a Comment/Comments