శ్రీకృష్ణలీలలు.. మణిపూసలు ....వడ్ల నర్సింహా చారి

శ్రీకృష్ణలీలలు.. మణిపూసలు ....వడ్ల నర్సింహా చారి

శ్రీకృష్ణలీలలు.. మణిపూసలు
        ....వడ్ల నర్సింహా చారి

ద్వాపర యుగమందున
దేవకీ గర్భమున
ఈ యిలన జన్మించెను
శ్రీ కృష్ణ రూపమున!!

మహా విష్ణువు అంశము
దివ్య మంగళ రూపము
వీక్షించినచాలు మనకు
సర్వ దు:ఖ నాశనము!!

రేపల్లెన ఆడి,పాడె
వెన్నదొంగ యితడెచూడె
గోవర్ధన మెత్తినట్టి
గోపాలా బాలుడితడె!!

కురుక్షేత్ర రణమందున
సవ్యసాచి సమ్ముఖమున
గీతను బోధించెను
శ్రీకృష్ణునీ రూపమున!!

చిన్ని కృష్ణు ముఖపద్మము
కోటి సూర్య సమన్వితము
మేఘఛాయ వర్ణముతో
మది దోచునట్టి రూపము!!

..మణికర్ణిక
వడ్ల.నర్సింహా చారి,
వికారాబాద్.

0/Post a Comment/Comments