ఎందుకు..?(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ఎందుకు..?(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

ఎందుకు..?(కవిత)


ఎందుకు ఈ అనవసరపు ఆర్భాటం..!?
ఎందుకు ఈ 
పిచ్చి హామీలు..!?
అమలుకు నోచుకోని పథకాలు ఎందుకు..!???
జనాలను సోమరిగా చేయడం తప్పించి 
మరేమీ కాదు..!??
పనిచేసే సామర్థ్యాన్ని 
దెబ్బ తీయడమే..!??
పని చేయకుండానే..
ఫలితం ఆశించే పద్ధతి సరైంది కాదు..!
కాని అలాంటి వాటినే ప్రవేశ పెట్టడం..
కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు అవుతోంది పరిస్థితి..!??
దేశం మొత్తంలో ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది..!
పని చేసి బ్రతికే వాడు,
ఆ పనిని నేనెందుకు చేయాలి..!??
నన్ను ఆదుకోడానికి 
పథకాలున్నాయి కదా..!??
రుణ మాఫీలున్నాయి కదా నని ఎదురు ప్రశ్నిస్తాడు..!??
తాత్కాలికంగా పథకాలు మేలు చేస్తాయి,
కాని దీర్ఘకాలికంగా దుష్ప్రభావాన్ని చూపెడతాయి..!??

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్.
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments