తెలుసుకో చరిత్ర (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

తెలుసుకో చరిత్ర (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

తెలుసుకో చరిత్ర


ఏ దేశ చరిత్ర చరిత్ర 
ఏమున్నది గర్వకారణం
అన్నాడు గురజాడ
అదే అసలైన నేటి జాడ

గత అనుభవాల సారాంశమే చరిత్ర
గతమెంత ఘనకీర్తి యే చరిత్ర
గతమంతా తెలుసుకునే చరిత్ర
గతమే భవితకు మూల చరిత్ర

చరిత్ర కావాలి స్ఫూర్తి
చరిత్ర తెలపాలి కీర్తి
చరిత్ర తెలుసుకునే ఆర్తి
చరిత్ర కాదు అసంపూర్తి

చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది మన శక్తి
అభివృద్ధి కి వాడాలి యుక్తి
ప్రతీది తెలుసుకోవాలి ప్రతీ వ్యక్తి
అప్పుడే సంపూర్ణమైన విముక్తి

తరం తరం నిరంతరం
క్షణం క్షణం అనుక్షణం
తెలుసుకోవాలి తెలియపరచాలి
అదే అసలు చరిత్ర

చరిత్ర ఒక ఋజువు
చరిత్ర ఒక ఆధారం
చరిత్ర ఒక మార్గదర్శి
చరిత్ర ఒక దార్శనికత

ఒక వ్యక్తి సంపూర్ణ జ్ఞాని కావాలంటే 
తప్పదు చరిత్ర తెలుసుకోవడం
మహానుభావుల చరిత్రలే మనకు మార్గదర్శకాలు
చరిత్ర జాడ లేనిదే మనుగడలేదు
తెలుసుకోచరిత్ర మేలుకో మనిషిగా

రచన: పసుమర్తి నాగేశ్వరరావు
            టీచర్ సాలూరు
             విజయనగరం జిల్లా
 

0/Post a Comment/Comments