మానవత్వం మరువకండి ---పసుమర్తి నాగేశ్వరరావు

మానవత్వం మరువకండి ---పసుమర్తి నాగేశ్వరరావు

మానవత్వం మరువకండి

అమ్మానాన్నలు దైవస్వరూపాలు
ఎప్పటికీ వారే ప్రత్యక్ష దైవాలు
మనల్ని కని పెంచిన నిజరూపాలు
వారు మనకు కనిపించే దైవాలు

నాడు అమ్మానాన్నలు స్వయం శక్తులు
నేడు వారు వయసు రీత్యా ఆశక్తులు
వారిపై కసాయి సంతానం ప్రయోగిస్తున్నారు కుయుక్తులు
బయటకు చెపుతున్నారు నీతి సూక్తులు

ఉండాలి అమ్మానాన్నల పై నిత్యం భక్తి
అదే మన జీవితాలకు నిజముక్తి
దేవుని ప్రార్ధించి పొందండి ఆ శక్తి
వారిని బానిసలు గా చూస్తే ఉండదు పాపవిముక్తి

కనీ పెంచడం అమ్మానాన్నల ధర్మం
వారిని వృద్ధాప్యం లో చూడడం మన ధర్మం
అదే శాస్త్రాలు చెబుతున్న నైతిక ధర్మం
కాకుంటే అది నిజం గా మన ఖర్మం

ఏ పూర్వపుణ్యమో ఏ యాగ ఫలమో
ఏ దేవుని దయా హృదయమో
ఏమి ఆశించని తల్లిదండ్రులను పొందావు
దానికి ప్రతిఫలం నీ దగ్గర గుక్కెడు గెంజి వృద్ధాశ్రమం లో కాదు

దయచేసి మానవతా విలువలు కాపాడండి
మానవత్వాన్ని ప్రదర్శించండి
అమ్మానాన్నలను భాద్యతగా చూసుకోండి
జన్మ పునీతం చేసుకోండి

ధర్మోరక్షిత రక్షతః

రచన: పసుమర్తి నాగేశ్వరరావు
            టీచర్ సాలూరు
            విజయనగరం జిల్లా
            94441530829


0/Post a Comment/Comments