'అంతా నీ లీలే కదా! కన్నయ్యా!!' ---సుజాత.పి.వి.ఎల్.సైనిక్ పురి, సికిందరాబాద్.

'అంతా నీ లీలే కదా! కన్నయ్యా!!' ---సుజాత.పి.వి.ఎల్.సైనిక్ పురి, సికిందరాబాద్.


'అంతా నీ లీలే కదా! కన్నయ్యా!!'
(వచన కవిత)

దేవకీ గర్భాన 
రోహిణీ నక్షత్ర సమక్షంలో
శ్రావణ శుద్ధ అష్టమి తిథిలో జన్మించి..
యశోదమ్మ ఇంట
నోముల పంటగా..
అల్లారు ముద్దుగా
ఆబాల గోపాలాన్ని అలరించిన 
కన్నయ్యా!..అంతా నీ లీలే కదా!
వెన్న ముద్దలారగించ 
చిన్ని నోటి నిండా
మన్ను తినొచ్చి
ముల్లోకాలు చూపించిన 
కన్నయ్యా!..అంతా నీ లీలే కదా!
కాళీయుని తలపై తాండవమాడినా..
చిటికెన వేలితో గోవర్థన గిరి ఎత్తి..
రేపల్లెను కాపాడినా..
పదహారు వేల గోపికల మనసు దోచి..
వేణు గానంతో మంత్ర ముగ్దుల్ని గావించినా..
అష్ట భార్యల నడుమ
ఇష్ట సఖి సత్యతో..'మీర గలడా నా మాట' అనిపించుకున్న సత్యభామ సహితుడా!.
కన్నయ్యా!..అంతా నీ లీలే కదా!
తులా భారంలో తులసీ దళానికే తూగి..
బరువు, పరువును భక్తితో కొలవచ్చని నిరూపించిన చిన్మయానందుడా! కన్నయ్యా!..అంతా నీ లీలే కదా!
రోలు తాడుతో కట్టివేయ బలంగా ఈడ్చుకొచ్చి..
రెండు చెట్లు కూల్చి,
నలకూబరుల శాపవిమోచనం కలిగించిన కన్నయ్యా!..అంతా నీ లీలే కదా!
మాయా రాక్షసుల పనిపట్టి..
మామ కంసుని అంతమొందించ..
దుష్ట శిక్షణ..శిష్ట రక్షణకై..
మానవ జన్మ అవతారమెత్తిన మహా విష్ణు రూపుడవు..
కన్నయ్యా!..అంతా నీ లీలే కదా!
ప్రతి వత్సరం జన్మాష్టమి జరుపుకోవడం..
నీ లీలలు మననం చేసుకోవడమే కదటయ్యా!
జగన్నాటక సూత్రధారి..జగద్గురువు..
జయ జనార్థనా! కృష్ణా! ముకుందా మురారి..
పాహిమాం!.. సదా రక్షమాం!!

---సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్. 

0/Post a Comment/Comments