సూర్యోదయం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్" విన్నర్"

సూర్యోదయం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్" విన్నర్"

సూర్యోదయం..!(కవిత)

"సూర్యోదయం"
అందమైన మరొక రోజు దొరికింది,
దేవుడి దయవల్ల..!

ఆహా.. ఎంత హాయిగా అనిపిస్తున్నదో కదా, 
నునువెచ్చని సూర్యుని కిరణాలు 
తనువును తాకినప్పుడు..!?

ఆహా.. ఏమి ఆనందం,
ఈ పచ్చని పచ్చిక మీద నడుస్తున్నప్పుడు..!??

ఆహా..ఆ పక్షులు సైతం ఎంత సంతోషంగా,
హుషారుగా ఆటలాడుచున్నవి..!?

ఆహా.. ఆ కుందేళ్ళు,నెమళ్ళు, ఉడతలుతదితర జీవులు 
ఎంతటి ఆహ్లాదాన్ని అనుభవిస్తున్నవో కదా..ననిపిస్తోంది.!??

ఆహా.. హుషారైన ఈ  భానోదయం..
భాను కిరణాలు ఎంత మాయ చేస్తున్నాయి..
ఆశ్చర్యం గాక పోతేను..!??

ఆహా.. ఆ సెలయేరు గట్ల మీదనుంచి దుముకుతుంటే..
నీళ్ళు సూర్య కిరణాలతో ప్రతిబింబిస్తూ..
కంటికి సువర్ణ కిరణాలు గా భ్రమిస్తూ.. ఆనందం కలిగిస్తుంటే..,

ఇంకే మని చెప్పాలి..మది ఆనంద డోలికల్లో ఊగులాడుతుందే..!?
అంతా" అందమైన సూర్యోదయం" మాయ..!?

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్,
నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments