శీర్షిక:నివురు గప్పిన నిప్పు (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

శీర్షిక:నివురు గప్పిన నిప్పు (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

శీర్షిక:నివురు గప్పిన నిప్పు

ఉచితం ఉచితం ఉచితం సర్వం నేడు ఉచితాలు 
అవే నేడు ప్రభుత్వాలు అందిస్తున్న
సర్వోచితాలు
ఇవి ఎవ్వరికీ ఎందుకో అని తెలియని మనోగతాలు
దీని పర్యవసానం పూడ్చలేని ఫలితాలు

ఉచితాలకు అలవాటు పడ్డవాళ్ళు
నిజ భవితను ఊహించని వాళ్లు
తమను తామే వంచించుకున్నవాళ్ళు
చేతులారా శ్రమైక జీవనాన్ని పోగొట్టుకున్నవాళ్ళు

ఓటు వేశామని ఒకరు నోటు ఇచ్చామని ఒకరు
ఊరకే వచ్చిందని ఒకరు ఊరికే ఇస్తున్నాం కదా అని ఒకరు
పదవికోసం ఒకరు పనిలేక ఇంకొకరు
ఎవరి స్వార్ధం వాళ్లదే ఎవరి ఆలోచన వాళ్లదే

ఇదే ముప్పు ఇదే తప్పు ఇదే నేడు నివురు గప్పిన నిప్పు
దేశాన్ని కుదిపేస్తుంది మూలాల్ని నాశనం చేస్తుంది
నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతాయి
అభివృద్ధి అటకెక్కుతాది అన్న నిజాన్ని అందరూ గ్రహించాలి

కావలసిన విద్యారంగం వైద్యరంగం
కార్పొరేట్ ల హస్తగతమవుతాయి
నాణ్యమైన విద్య వైద్యంనోట్లకట్లపై
నఖరాలు చేస్తాయి
వివేకానందుడు వాజపేయ్ చెప్పినట్లు చేయాలి విద్యా వైద్యం ఉచితం 
ఇవి కానివి ఏవి ఉచితమైన ఏ దేశమైన నివురుగప్పిన నిప్పువలె
మసిబారక తప్పదు
కళ్ళు తెరచుకొని తేరుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా

ఇది నా స్వీయారచన. హామి ఇస్తున్నాను

0/Post a Comment/Comments