శీర్షిక: తేరుకోనేలేదింక
అప్పుడప్పుడు పుడమిపైకి
భగవంతుడొక విపత్తును
విసిరేసి
మనిషి అజ్జానాన్ని దిద్జుకునేందుకు
అవకాశాన్నిస్తాడేమో
సృష్టికి ప్రతిసృష్టి చేసే మనిషి
అనుకోని విపత్తుముందు మొకరిల్లాల్సిందే
నేడు కాయాన్ని కానరాకుండచేసే
వైరస్ భూతం సంచరిస్తూనేవున్నది
లక్మణరేఖలనెన్నిగీసినా
రూపం మార్చుకుంటూ దాడినాపడంలేదు
రెండు దాడుల్లో ఎంతోమంది మాయమైపోయారు
ఊపిరాడకుండాచేసి ఉసురుతీసేసింది
ఆత్మీయులు మాయమై అనాధలైన దృశ్యాలెన్నో
మనిషి మేధస్సుకంతుచిక్కక
విశ్వమంతా విద్వంసం
బతుకు భయంతో జతకట్టింది
మరేమిటిపుడు
ఓవైపు మూడో తరంగం
మరో ఉప్పెనై వస్తోందంటూ హెచ్చరికలు
అదికూడా అభంశుభం తెలియని చిన్నారులపైనేనంటూ
పాలకవర్గమేమో బడిపిల్లలందరూ బడికెల్లాలంటూ వచ్చే విపత్తుకు వత్తాసు పలుకుతూ
సరైన సమయానికి సహకరిస్తున్న తీరుజూస్తే
ఎవరికోసమిదంతా
మెడికల్ మాఫియాకు సహకారమా???
జరిగిన పరిణామాలింకా కళ్ళముందు కదలాడుతూ
గుండెలోంచి కారే కన్నీటి తడి
ఆరానేలేదింక..!!
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.
హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.