నిరక్షరాస్యత నిర్మూలిద్దాం - సమ సమాజాన్ని నిర్మిద్దాం --దొడ్డపనేని శ్రీ విద్య, విజయవాడ.

నిరక్షరాస్యత నిర్మూలిద్దాం - సమ సమాజాన్ని నిర్మిద్దాం --దొడ్డపనేని శ్రీ విద్య, విజయవాడ.


నిరక్షరాస్యత నిర్మూలిద్దాం - సమ సమాజాన్ని నిర్మిద్దాం

నేటి సమాజంలో సమ సమాజ స్థాపన కోసం ఎంతో మంది పాటుపడుతున్నారు. అందులో నిరక్ష్యరాస్యత ఒకటి. నిరక్షరాస్యత లేని సమ సమాజ స్థాపన కోసం శ్రమించే వారు ఎందరో. జనహితం, జన నాడి తెలిసిన ఎందరో ప్రముఖులు పోరాటాలుచేసి చేసి అలిసిపోయారేమో!

నిరుపేద కుటుంబాలు సైతం ఆకరాస్యత వైపు దిశ , దిక్కులు పిక్కటిల్లేలా అర్రులు చాస్తున్నారు. వాళ్లని ప్రోత్సాహ పరిచి, అందుకు తగిన వనరులను వాళ్లకు సమకూర్చే ఏర్పాటు చెయ్యాలి. అటువంటి శ్రమ వైపు నాయకులు అడుగులు వెయ్యాలి అని సమాజం కోరుకుంటోంది.

ఎందరి ఆశలకో ఊపిరి పోయాలి. గిరిజన, అట్టుడిగిన పేదలను సైతం అక్షరాస్యత వైపు అడుగులు వేయించాలి. వీధి బడులు ఏర్పాటు చెయ్యాలి. వారికీ శిక్షణ ఇచ్చే విధంగా గ్రామాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యాలి. అప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుంది. గాంధీజీ కన్న కలలు నెరవేరుతాయి.

మన దేశంలో ఇంకా ఎన్నో జాడ్యాలు ఆవరించి ఉన్నాయి. వాటి మూలాలను సమూలంగా నాశనం చెయ్యాలి. మానవాళిని జాగృతం చెయ్యాలి. అంటరాని తనం అని, మానవ బలులు, నిరక్షరాస్యత అనేవి ఇంకా మారు మూల గ్రామాల్లోనే కాదు నాగరిక ప్రపంచంలో కూడా చూస్తున్నాము. ఇలాంటి సామాజిక జాడ్యాలను రూపుమాపటానికి ఎందరో విజ్ఞులు పాటు పడుతున్నారు. వారికి మనం కూడా చేయూత నివ్వాలి. 

రాజా రామ్మోహనరాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు గారు నడచిన బాటలో మనం కూడా నడవాలి. వారి ఆశయాలను ఈనాటి సంఘ సంస్కర్తలు, నవ యువత ఆచరించేలా ఓ అడుగు ముందుకు వేయాలి.

వంశ పారపర్యంగా వచ్చే కొన్ని జడ్యాలను రూపు మాపాలి. ఆచారాలు, కుల వివక్షను పరద్రోలాలి. నేటి సమాజంలో యువతలో నిక్షిప్తమైన ఆధునిక భావాలను, ఆలోచనలను, వారి పరిజ్ఞానాన్ని వెలికితీసి వారిని ప్రోత్సహించాలి. యువత యొక్క శక్తులను సమ సమాజ స్థాపన కోసం ఉపయోగించాలి. దేశం కోసం పాటుపడాలి. వైఫల్యాల నుంచి మేల్కొని, నిరుత్సాహ పడకుండా, విజ్ఞానాన్ని దేశ ప్రగతి కోసం వినియోగించాలి.

ఇందు కోసం ప్రభుత్వం ఎన్నో ఎన్నో అవకాశాలను యువతకు అందిస్తోంది. వాటిని యవత అంది పుచ్చుకుని, దేశ భవిష్యత్తుకు, తమ శక్తిని ఉపయోగించి నిరూపించు కోవాలి.

పత్రికలు సైతం ఇటువంటి జాడ్యాలను రూపుమాపటంలో తమ వంతు ఎంతో కృషి చేస్తున్నాయి. అందుకు అభినందనలు. ఎన్నో సొసైటీలు, సంఘాలు ఏర్పడ్డాయి ఇటువంటి వాటిని రూపుమాపటానికి. ఉద్యమాలు, పోరాటాలు, గ్రంధాలు ఆవిష్కరించ బడ్డాయి. ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయినా ఇటువంటి దురాచారాలను రూపుమపటంలో యింకా వెనుకంజ లోనే ఉన్నాము. 

నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యత వైపు అడుగులు వేసేవిధంగా  నేటి తరం యువతను  జాగృతం చెయ్యాలి అని కోరుకుంటూ సమ సమాజ స్థాపన కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటాను.


- దొడ్డపనేని శ్రీ విద్య,
విజయవాడ.

1/Post a Comment/Comments

Unknown said…
ధన్మువాదములు సార్
నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్నందుకు🙏🙏🙏