ఆత్మీయనేస్తం --- వి. కృష్ణవేణి, వాడపాలెం.

ఆత్మీయనేస్తం --- వి. కృష్ణవేణి, వాడపాలెం.


స్నేహితుల దినోత్సవం సందర్భంగా..

ఆత్మీయనేస్తం 

జీవితంలో వెన్నంటూ వుంటూ..
అంతమంటూ లేని అనంత భావమే స్నేహం.

ఆపదలో ఆత్మ బంధువుగా ఉంటూ..
కష్టాలలో కన్నీళ్లను తుడుస్తూ..
బాధల్లో భరోసా ఇస్తూ..
కులమత బేధాలులేకుండా.
పేద ధనిక తేడాలేకుండా.
వీడిపోని అపురూప బంధం స్నేహం.

స్నేహంలేని జీవితం వ్యర్థం
కాలం గడిచిన మరువలేనిది స్నేహం
నిస్వార్థ త్యాగానికి పవిత్ర  స్నేహం
అపురూప బంధం దేవుడిచ్చిన వరం స్నేహం
అపురూప అనురాగాల ప్రతి రూపం స్నేహం.

భావాలు భావోద్వేగాలు పంచుకుంటూ..
ఒకరికొకరు సహాయం చేసుకుంటూ..
ఆపదలో తోడునీడగా అండగా ఉంటూ.
స్థిరంగా ఉంటూ నిరంతరమైనది
శాశ్వతమైనది ఒక్క స్నేహం మాత్రమే..

అద్భుతమైనది
అపురూపమైనది
పవిత్రమైనది
కష్టాలలో తోడుగా
ఆనందంలో పలుపంచుకుంటూ..
ఆప్తులకంటే కూడా తోడుండే నిజమైన 
ఆత్మీయతను చాటుకునేది ఒక్క స్నేహం మాత్రమే..

--- వి. కృష్ణవేణి
వాడపాలెం.

ప్రక్రియ :వచనం 
 

0/Post a Comment/Comments