శ్రీకృష్ణ లీలలు..
దేవకీసుతా
శ్రీకృష్ణం వందే జగద్గురుం
దేవకీవసుదేవుల సుతుడా
జన్మించావు చెరసాలలో
కంస మామ కాఠిన్యం అణచావు
దీనులను కాపాడ దేవుడై వెలిసావు
ఏమని వర్ణించను నీ లీలలు
రక్కసి పూతకిని హతమార్చి..
రాక్షస బాధని మరిపించావు ...
మానవునిలా మన్ను తింటూ
నోరు చూపు మన్న యశోదమ్మకు విశ్వాన్ని దర్శింప చేశావు.....
గోపాలుడు వై , స్నేహానికి నిర్వచనం నీవై అందాల సుందర భాగవతానికి ఆలంబన నీవు...
ప్రేమకు నిర్వచనం నీవు ఇద్దరమ్మల ముద్దుల తనయుడు వై మాతృ ప్రేమకు మధుర అనుభూతికి నీవు నీ ప్రేమే తార్కాణం...
యమునా తీరాన రాధమ్మ తో
రాస క్రీడ లా...
ఆమె పవిత్ర ప్రేమ ను పొందారు
తరతరాల ప్రేమకు చిహ్నం అయ్యారు .
హృదయంలో నిన్నునింపుకొని
భాహ్య ప్రపంచాన్ని మరచిన
మీరా ప్రేమకు భాష్యం మీరు
కృష్ణా...ద్వారక నిలయా....
నీ లీలతో అందరినీ మైమరపించే నీ రూపం అపురూపం...
ధర్మ సం స్థాపనార్థం సంభవామి
యుగే యుగే...
అన్నట్లు నీ లీలలు అద్వితీయం..
అమోఘం
అనిర్వచనీయం...
సహస్ర కోటి వందనాలు నీ పాద పద్మముల కు......
కృష్ణా ముకుందా మురారి...
పేరు:శ్రీమతి సత్య మొం డ్రెటి ఊరు హైదరాబాద్
చరవాణి 94 9023 95 81
ప్రక్రియ:వచనం
హామీ పత్రం:కవిత నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను