రచయిత్రి ధనాశి ఉషారాణికి "మాలిక మిత్ర" బిరుదు

రచయిత్రి ధనాశి ఉషారాణికి "మాలిక మిత్ర" బిరుదు

 

రచయిత్రి ధనాశి ఉషారాణికి మాలిక మిత్ర బిరుదు


చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి, ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు ధనాశి ఉషారాణి గారు ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే సాహితీ పక్రియలను రూపొందిస్తూ తోటి కళాకారులకు అనేక అవార్డులును ఇవ్వడముతో పాటు కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ నూతన కవులను ప్రోత్సహిస్తూ, అనేక నూతన ప్రక్రియల్లో శతకాలు రాస్తున్నారు. 

కర్నూలు జిల్లా నాగటూరు లక్ష్మి నారాయణ కళా సాహితీ వేదిక ఆధ్వర్యంలో మాలికలు ప్రక్రియలో 116 మాలికలు రాసినందుకు గాను మాలికమిత్ర బిరుదును పొందారు. రూపకర్త గాజుల నరసింహా గారు గౌరవ అధ్యక్షులు ఆచార్య రామనాధం గారు  తెలియజేసారు. ఇప్పటికే అనేక పుస్తకాలు సాహిత్యంలో అచ్చువేసి అనేక అవార్డులుపొందారు. సాహితీ ప్రముఖులు అభినందనలు తెలియజేసారు.

0/Post a Comment/Comments