తెలుగు భాష పరిమళాలు --దొడ్డపనేని శ్రీవిద్య

తెలుగు భాష పరిమళాలు --దొడ్డపనేని శ్రీవిద్య


తెలుగు భాష పరిమళాలు

తెలుగు భాష - ఓ మధుర భాష రక్షించుకుందాం
పరభాషా మోజులో ఉన్నవారి నుంచి పరిరక్షించుకుందాం

జానపదాల విలువను జనం గుండెల్లోకి తీసుకెళదాం
పల్లె పదుల గీతాలను పదలంగా కాపాడుకుందాం

నాటకాలను నరం నరం నిండా జీర్ణించుకుందాం
తేనె లొలుకు తెలుగు పరిమళాలను వెదజల్లుకుందాం

కావ్య, కవితా సంప్రదాయాలను గౌరవించుకుందాం
మన భాషా పదనిసల ఆణి ముత్యాలను కూర్చుకుందాం

మట్టి సువాసనల నుంచి వెలిగిన సువాసనలను ఆస్వాదించుకుందాం
తెనుగు భాష మాణిక్యాలను సుసంపన్నం చేసుకుందాం

తెలుగు భాషా సాహిత్యాల పూలమాలను అల్లుకుందాం
మాతృభాషా భోధనను చురుకుగా చర్చించుకుందాం

మనసును ఆహ్లాదం కావించే తెలుగు భాషను బ్రతికించుకుందాం
మనో వికాసంతో సృజనాత్మకతను కలిగించేలా భాషా సామర్ధ్యాన్ని పెంచుకుందాం

తెలుగు తల్లికి భాషా సౌరభం అద్ది మెరుగులు దిద్దుకుందాం
పర భాషను గౌరవిస్తూ మన భాషలో మాట్లాడుకుందాం

సాహితీ సదస్సులలో మన ప్రావీణ్యాన్ని మెరుగుపరుచుకుందాం
మహనీయుల భాషా పోరాటాలని స్మరించుకుందాం

పురాణ ఇతిహాసాల నుండి మాత్ర భాషను నేర్చుకుందాం
మన తెలుగు భాషా గొప్పతనాన్ని విరివిగా ప్రశంసించుకుందాం

ఔత్సాహికులకు భాషానురక్తిని రగిలిస్తు కృషి చేసుకుందాం
భారతీయ తెలుగు భాష సాహిత్య సంపదను సత్కరించుకుందాం
తెలుగు భాషా భావజాలాన్ని జల్లెడ పట్టి జాతీయం చేసుకుందాం

స్వభావ రక్షణ, స్వభాషా పరిరక్షణను సాహిత్య ప్రియుల సాక్షిగా కాపాడుకుందాం
తెలుగు భాషా వెలుగులను నిత్యం విరిజమ్ముకుంటూ అనందిద్దాం

గిడుగు రామ్మూర్తి గారి ఆశయసాధనలో మనమూ భాగమై నడుద్దాం

తెలుగు వాడిగా గర్వించు
తెలుగు భాషా ప్రావిణ్యాన్ని ఉద్దరించు...
భావితరాలకు తెలుగు యాసను అందించు


--దొడ్డపనేని శ్రీవిద్య
విజయవాడ
94 92 85 8442

0/Post a Comment/Comments