బడి పిలుస్తోంది!! --గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

బడి పిలుస్తోంది!! --గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

బడి పిలుస్తోంది!!
---------------------------

బాలలారా! రండి!
బడమ్మ పిలుస్తోంది
ప్రేమగా మిమ్ములను
వేగిరం రమ్మంది

బడి వేళ అయిందని
గంటమ్మకు చెప్పింది
స్వాగతం పలకమని
అదేశమంపింది

కరోనా మెళుకువలు
పాటించాలన్నది
అప్రమత్తంగా ఇక
ఉండాలంటుంది

కోవిడ్ భూతంతో
కుంటబడిన చదువులు
సాఫీగా సాగాలని
మనసారగ కోరింది

---గద్వాల సోమన్న ,
      ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments