భాషలెన్ని ఉన్నా... విన్నా... అన్నా...
భావోద్వేగాల వ్యక్తీకరణ లో
మాతృభాషకు సాటేది...?!!
చక్కెర గుళికలు కలిపిన
చిక్కటి పాయసం లాంటి
చక్కని, తీయని తెలుగు.
వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు,
కావ్యాలు, పురాణాలు, గ్రంధాలు అనే
సువాసనల పుష్పాలతో అల్లిన
సమాహార మాల ఈ తెలుగు..!!!
పరదేశీయుల నుంచి వచ్చిన,
పరభాషా మోజులో... మనమే
మన తెలుగుకు ఏ గతి పట్టిస్తున్నాం...??!!!
"పర" భాషలోనే ఉంది పరాయితనం
"మాతృ" భాషలోనే ఉంది అమ్మతనం
'పరభాష విజ్ఞానానికి మంచిదే....
మన భాష అజ్ఞానాన్ని తొలగిస్తుంది.'
ఈ జీవిత సత్యాన్ని తెలుసుకో.....
తెలుగు వెలుగుల కాంతి రేఖల్లో
క్రాంతి పథం వైపు పయనించు..!!
-- ఐ. సత్య, హైదరాబాద్.