ఏం చేస్తున్నావ్..?
వర్ణవైషమ్యాల వర్గపోరాటంలో
మంటగలుస్తున్న మానవత్వం
మదమెక్కిన కామపు పులిపంజాల్లో
ఆవిరైపోతున్న అతివలశీలం
అవినీతి కాసుల ఆపేక్షాకాష్టంలో
దహించుకుపోతున్న ధర్మం
స్వార్థపు కోరలతో మేధస్సుపాము
నిలువునా కాటేస్తున్న నేటిసమాజం
రాజకీయ ఆలోచనాచదరంగంలో పావులై
కుదేలవుతున్న యువతరం
స్వచ్ఛనిప్రకృతిలో శిశిరం తాండవిస్తూ
పడగ విప్పుతున్న ఘోరకాలుష్యం
న్యాయం ఎండమావై
అడుగడుగునా నరకం ప్రత్యక్షమవుతుంటే
మౌనమేల? ఓ..మానవా! ఇకనైనా.. నువ్వు మారవా?
భస్మాసురహస్తమై నీచేష్టలే
నీఉనికిని పాతాళానికి తొక్కేస్తుంటే..
మారణహోమాన్ని వీడవా?
మనిషితనంకై ఆరాటపడవా?
ఓసారి ఆలోచించు!నవజీవన వాసంతానికై ప్రయత్నించు!
--అయిత అనిత,
జగిత్యాల.