ప్రక్రియ:సున్నితం రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు ---చంద్రకళ. దీకొండ, మల్కాజిగిరి-మేడ్చల్ జిల్లా.

ప్రక్రియ:సున్నితం రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు ---చంద్రకళ. దీకొండ, మల్కాజిగిరి-మేడ్చల్ జిల్లా.

ప్రక్రియ:సున్నితం
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల 
సునీత గారు

౧)
శాస్త్రీయదృక్పథం లోపించిన కారణంగా
మనలో పాదుకునే మూఢనమ్మకాలు
అజ్ఞానం అవిద్యలే ముఖ్యకారణాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
౨)
ఎందుకు, ఏమిటి, ఎలా...?!
అని ప్రతిదానినీ ప్రశ్నించే
పిల్లల మనస్తత్వాన్ని ప్రోత్సహించు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
౩)
రాశులన్నీ  క్రమపద్ధతిగా పరిభ్రమించేవే
రోజులన్నీ కాలానుగుణంగా సాగేవే
చెడు అనునది చేతలతోనే
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
౪)
తలపై బల్లితో మరణమా...?!
విధవ ఎదురైతే అపశకునమా...?!
నీ తప్పులను కప్పిపుచ్చుకోవడమా...!
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
౫)
బలహీన మనస్కులకే భయాలన్నీ
నీలోని భయమే దెయ్యం
నీ  ధైర్యమే దైవం
చూడచక్కని తెలుగు సున్నితంబు...!

************************************
చంద్రకళ. దీకొండ,
మల్కాజిగిరి-మేడ్చల్ జిల్లా.
చరవాణి:9381361384
 

0/Post a Comment/Comments