చందమామ ఆట..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్" విన్నర్"

చందమామ ఆట..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్" విన్నర్"

చందమామ ఆట..!(కవిత)

మసకేసిన మబ్బుల్లో చందమామ..,
దాగుడు మూతలు ఆడసాగే చూడండి..!?

నల్లని మేఘాలలో తెల్లని చంద్రుడు 
దాక్కున్న వైనం చూడండి..!?

మిణుకు మిణుకు మను తారలు మధ్యలో ఎలా వరుస బెట్టి,
మల్ల దూరం దూరంగా మెరుస్తూ 
నిలబడ్డాయో చూడండి..!?

వినీలాకాశం మొత్తం నిశ్శబ్దంగా ఎలా విస్తారంగా, 
విశాలంగా గొడుగు పట్టుకుని ఉన్నట్లు ఉందో చూడండి..!?

చల్లని గాలులు సైతం ఎలా పిచ్చి చేష్టలు చేస్తూ 
వాని చుట్టూ తిరుగుతూ సందడి చేస్తున్నాయో చూడండి..!?

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్,
నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments