ముత్యాల హారాలు --చైతన్య భారతి పోతుల

ముత్యాల హారాలు --చైతన్య భారతి పోతుల

*ముత్యాల హారాలు*
241.
మరెన్నో పండుగలు
ఏటేటా సంబరాలు
కంటినిండా వెలుగులు
నిండాలి హరివిల్లులు
242.
స్పర్దలే వద్దండీ
కలసి మెలసి ఉండoడీ
శాశ్వతం కాదండీ
జీవితం మాయ అండీ
243.
సర్వము అర్పించుము
త్యాగమే తన గుణము
సడలనిది ఆమె ధైర్యము
తల్లి శక్తి స్వరూపము
244.
పాపకు తొలి దైవము
కుటుంబ పరిపాలనము
పనిలో చాతుర్యము
అందరికీ అనురాగము.
245.
మనసులో మంచితనము
మాటలోని  సత్యము
నడతలోని వినయము
జీవితము బంగరు మయము
246.
ఇంటి అందం ఇల్లాలు
తోట అందం పూవులు
బడికి అందం పిల్లలు
జీవిత అందం చదువులు
247.
పరువాలా బొమ్మలు
అందాలా అమ్మలు
వారు కులికేటి హొయలు
పడుచు దనము గల సిరులు
248.
మెరిసేటి మోములు
సిగలోనా పూవులు
నల్లనైనా నీ కురులు
ఏమి అందం అమ్మలు
249.
పిలిచారా..!పిల్లలు
అల్లరెందుకు అయ్యలు
బుద్దిగానూ చదువులు
బాగు పడవ జీవితములు

250
గురువుల మంచి మాట
మీ భవితకు బాటలు
పేదవారి బతుకులు
బాగుచేయు చదువులు

చైతన్య భారతి పోతుల
హైదరాబాద్
701326644

0/Post a Comment/Comments