తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో
కొల్లూరు వారి నేటి కవిత
తెలుగు తెలుగని మురిసేము
తెలుగువారై తెలుగునే మరిచేము
తెలుగుకి తెగులు పట్టించేము
తెలుగుకి పట్టిన తెగుల్ని తొలగిద్దాం
తెలుగువారు తేటతెల్లమైనవారు ఒకప్పుడు
తెలుగువారు తెలుగోరేలేే పదహారణాల్నాడు
తెలుగు తెరమరుగైనాది నూరుపైసలప్పుడు
తెలుగు తేజాన్ని పునరుద్ధరించాలిక ఇప్పుడు
తెలుగును ఆదరించాల్సిన బాధ్యత మనదే
తెలుగును అభిమానించాల్సిన విధీ మనదే
తెలుగును సరిగ్గా వినియోగించే పనీ మనదే
తెలుగును చక్కగా తీర్చిదిద్దే కర్తవ్యం మనదే
తెలుగువారై పుట్టినందుకు గర్వించాలి మనం
తెలుగువారై మెలగలేదని చింతించాలి మనం
తెలుగుని ఉద్ధరిస్తామని బాసచేయాలి మనం
తెలుగుతల్లికి మనసారా నమస్కరిద్దాం మనం
--కొల్లూరు వెంకటరమణమూర్తి, హైదరాబాదు
Post a Comment