నేడే తెలిసింది ఒక నిండునిజం ... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

నేడే తెలిసింది ఒక నిండునిజం ... పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

నేడే తెలిసింది ఒక నిండునిజం ...

పాముతో కలిసి 
వేడివేడి పాలు త్రాగాలని 
పాము పడగ నీడన 
ప్రశాంతంగా పవళించాలని 
కమ్మని కలలు గనే 
ఆ అమాయకపు కప్పలకు
తెలియదు పాపం ఒక పచ్చినిజం 

తమకు ప్రాణగండమున్నదని
తమకు పాముకు బద్దవైరమని
తాము పాములకు ఆహారమని
ఆ అమాయకపు కప్పలకు
తెలియదు పాపం ఒక పచ్చినిజం 

కప్పలు పదివేలు ఏకమైనా 
ఒక్కపామునైనా సంహరించలేవని
చీమలు కూడా పాములకు శతృవులను
ముల్లును ముల్లుతోనే తియ్యాలను
ఆ అమాయకపు కప్పలకు 
తెలియదు పాపం ఒక పచ్చినిజం 

కసిపట్టి బుసలు కొట్టే కోడెనాగుల 
విషపు కోరల నుండి 
విముక్తి లభించాలంటే 
కప్పలన్నీ చలిచీమల సహకారం 
తప్పక తీసుకోవలసిందేనని
ఆ అమాయకపు కప్పలకు 
నేడే తెలిసింది ఒక నిండునిజం 

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్... 9120784502

0/Post a Comment/Comments