కాస్త ఆలోచించు మిత్రమా ..!
చేతిలోని వ్రేళ్ళు అన్నీ ఒకేవిధంగా ఉండవు..!
అలాగే మనుష్యులు,
మనస్తత్వాలు ఒకేలా ఉండవు..!!
ఒకరిని విమర్శించే ముందు,
ఆలోచించాలి..!
నోరుంది కదా అని..
ఏమేమో వర్లి బాధ పెట్టడం మంచిది కాదు..!
ఎంత మాట్లాడాలి..?
ఏం మాట్లాడాలి..?
దీని గురించి అవగాహన ఉండాలి..!
అనవసర మాటలు
తప్పిదాలై కూచుంటాయి..!?
నోరు జారేట్లుగా విమర్శల
పర్వం కొనసాగించడం..అవివేకం..!
నాకన్ని తెలుసు,
నేనే సొక్కమన్నట్లు
వ్యవహరించడం అజ్ఞానం..!
ఒకర్ని మించి మరొకరు ఉంటున్నారు..ఈ లోకములో..!??
అందుకే ఇతరుల
విషయంలో కాస్త సావధానంగా ఉండాలి..!
చాలా మందికి విమర్శించడం తేలిక..,అదే
సద్విమర్శ చేయడం
చేతగాదు..!?
కువిమర్శలకు
కొదవే ఉండదు..!??
విమర్శించే ముందు స్థాయి మరవక ..
కాస్త ఆలోచించాలి మిత్రమా..!??
✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ