స్వాతంత్రానంతర పరిణామాలు - మార్గం కృష్ణ మూర్తి

స్వాతంత్రానంతర పరిణామాలు - మార్గం కృష్ణ మూర్తి


- మార్గం కృష్ణ మూర్తి

స్వాతంత్రానంతర పరిణామాలు

చిన్న అవమానం ఝాన్సీని రగిలించే
చిన్న చెంపదెబ్బ బ్రిటిష్ ల తరిమి కొట్టే
చిన్న సంఘటన డయ్యర్ ను కాల్చిచంపే
దేశభక్తులత్యాగాలతోస్వాతంత్ర్యంసిద్ధించే!

మన్నెం దొర అల్లూరి గుండెనెదురొడ్డినా
ఝాన్సీ భారత గడ్డన వీరమరణమొందినా
విప్లవవీరుడుభగత్ సింగ్ ఉరికంభమెక్కినా
మహాత్ముడు అహింసతో  సాధించినా!

ఏడుపదులుదాటినా ఎక్కడేసినగొంగడక్కడే
మతాల,కులాల విడగొట్టి చిచ్చుపెడుతుండే
దేశానికిఅప్పులు లక్షల కోట్లల్లోపెరుగుతుండే
అభివృద్ధిచెందుతున్నదేశంగానే మిగిలిఉండే!

దేశంలో అవినీతి గుట్టల్లా పేరుకుపోతుండే
ఎదిగిన వారు కోట్లకు  ఎదుగుతూనే ఉండే
ఒదిగిన వారు పాట్లు పడుతూనే ఉండే
దేశ సంపదంతా కొద్దిమందిచేతిలోనేఉండే!

ప్రజలలో పేదరికం, ధనికులలో దాపరికం
విద్యార్ధులలో, నిరుద్యోగులలో నైరాశ్యం
విద్య  వైద్యం పేదలకు గగన కుసుమం
ఎన్నికలు , రాజకీయాలు లోపభూయిష్టం!

చట్టాలు ధనికుల చుట్టాలాయే
కులాలను చీల్చే, హామీలెన్నో యిచ్చే
అధికారం చేపట్టాక అన్నీ మరిచి పోయే
ఉచితపథకాలుతెరిచిజనులసోమరులచేసే
హిట్లర్ కోడిపెట్టలా జనులబానిసలనుచేసే!

- మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్



0/Post a Comment/Comments