తాలిబన్ల ఘాతుకం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

తాలిబన్ల ఘాతుకం..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

తాలిబన్ల ఘాతుకం..!(కవిత)
******✍🏻విన్నర్*****
తుపాకుల మోతలు,
తూటాల వర్షం..
తల్లడింపులు..
ఎక్కడ చూసినా 
హాహా కారాలు..!
ఎక్కడ చూసినా 
రక్త ప్రవాహాలు..!
అమానవీయత,అమానుషం రాజ్యమేలుతున్న తరుణం..!
సొంత సొమ్ము 
తాకట్టుపెట్టినట్లు ఆఫ్ఘనిస్తాన్ ను కబ్జా కావించడం.. 
తాలిబన్ల బలాత్కారం,హత్యాకాండ..
ఆఫ్ఘనిస్తాన్ సొంత జాగీరైనట్లు..
తాలిబన్ల అమానుషం,
ఎవ్వరూ అడిగేవాడు లేడని.. !???
ఇష్టారాజ్యంగా 
దురాక్రమణలు..!
సొంతదేశం వీడి,పారిపోతున్న ప్రజలు.. పిల్లలూ పెద్దలూ ఎదుర్కొంటున్న కష్టాలు..!
మనుష్యుల్ని చంపడం 
ఏ మతమూ, ఏ ధర్మము బోధించనప్పుడు..
మరి తాలిబన్లు ఎందుకు పవిత్ర ఇస్లాంను బద్నాం చేయపుట్టారు..!
తాలిబన్లు ఉగ్రవాదులు..!
వీరికి ఇస్లాంతో సంబంధం లేదు..!
రాజ్య కాంక్ష, అధికార వాంఛ ఉన్న దురహంకార, 
దోపిడీ దారులు, 
దోపిడీ దొంగలు,
కబ్జాకోరులు..!
ఆఫ్ఘనిస్తాన్ ను కాపాడే నాథుడే లేడా..!??
తాలిబన్ల ను తరిమేసే నాయకుడే లేడా..!??

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments