మమతల మూర్తి - మధర్ థెరిస్సా జయంతి సంధర్బముగా.... --దొడ్డపనేని శ్రీ విద్య

మమతల మూర్తి - మధర్ థెరిస్సా జయంతి సంధర్బముగా.... --దొడ్డపనేని శ్రీ విద్య

మధర్‌ థెరిస్సా జయంతి సందర్బముగా
 
"మమతల మూర్తి"

అభ్యుదయ భావాలు నింపిన మానవమూర్తి
అభాగ్యుల గుండెల్లో వెలుగు నింపిన మహోన్నతమూర్తి
జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి
కష్ట జీవులకు ఆసరాగా మారిన మాతృమూర్తి
భారతీయులలో మిన్నగా మారిన మహనీయమూర్తి
అనాథల పాలిట కల్పతరువు
మానవ సేవలో ఆమెకి ఆమే గురువు
తల్లి ఒడిలో నోబెల్ బహుమతి ఒదిగింది.
మృత్యువు కూడా ఆమె ముందు తల వంచింది.
ప్రజల దయనీయ స్థితిని చూసి కదిలింది
సేవలో జీవితం అంకితమయ్యేలా నిలిచింది.
అన్నిటా మార్గదర్శకం అయినది
మానవమూర్తి సేవలే ఆచరణీయం అనేలా చేసింది.
మన ప్రతి పలుకు ప్రేమతో రావాలంది
ఆ మాతృమూర్తి  స్పూర్తి ప్రదాత గా మదిలో నిలిచింది.
మానవత్వమే మమతల మూర్తి అనీ.....
విశ్వ మానవాళికి నిస్వార్థ సేవా తత్పరం నేర్పింది
విమర్శలను సైతం చిరునవ్వు తో స్వీకరించాలి అనీ
ఎదుటి వారిని ఆప్యాయంగా ప్రేమించాలి అని తెలిపిన 
శాంతిప్రదాత,  ప్రేమమూర్తి కి వందనం


--దొడ్డపనేని శ్రీ విద్య,
పుట్టపర్తి, అనంతపూర్ జిల్లా.

0/Post a Comment/Comments