పరమపూజ్యం ---- డా‌. రామక కృష్ణమూర్తి, బోయినపల్లి, మేడ్చల్.

పరమపూజ్యం ---- డా‌. రామక కృష్ణమూర్తి, బోయినపల్లి, మేడ్చల్.

పరమపూజ్యం
---- డా‌. రామక కృష్ణమూర్తి
బోయినపల్లి, మేడ్చల్.


భావిభారత పౌరుల నిర్మాణం
సంస్కార, పరికల్పనం
విషయపరిజ్ఞానాన్ని అందించడం
ఆలోచనా పరిధిని విస్తృతపరచడం
శీలనిర్మాణాన్ని పటిష్ఠంగా చేయడం
మూర్తిమత్వాన్ని పెంపొందిచడం
సృజనాత్మకతను వెలికితీసి
అభ్యసనప్రక్రియను సంపూర్ణమొనరించడం,
నైతికవిలువలను సమకూర్చడం
మానవవిలువలను నింపడం
కుటుంబవిలువలను నేర్పించడం
లక్ష్యాన్ని ఏర్పరిచి, కృషిచేయించడం
సహపాఠ్యకార్యకలాపాలను ప్రోత్సహించడం
ఆటలు,పాటలతో శారీరక,మానసిక వికాసాలను కలిగించడం
ఉపాధ్యాయవృత్తి అమూల్య కర్తవ్యం.


0/Post a Comment/Comments