అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రాసిన కవిత ---పురుషోత్తం సతీష్, కరీంనగర్.

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రాసిన కవిత ---పురుషోత్తం సతీష్, కరీంనగర్.


లేవండి యువతరమా..
-----------------------------

లేవండి యువతర మా  జనాతన సారదులై
జాగరులై లేవండి
ఆవేదన చిదిమేయ అలుపన్నది ఆదమరిచి
జాగరులై లేవండి

అడుగులో అడుగు లేస్తూ జడివానల నెదిరిస్తు
ఉరుకుల పరుగుల నెత్తురు ఉప్పెన లా పారిస్తు
దోపిడి అంతం చేయ దండుకట్టి కథనానికి కదలండి.  .//లేవండి//

నిరుపేదల నిర్జువుల స్వేదాలను తడుముకుంటూ
బడుగుల బ్రతుకుల్లోన వెలుగులై విరజిమ్ముతు
విశ్వానికి దశ దిశ లా విప్లవాల దీరుల వలె శూరుల వలె.    // లేవండి//

యువతరమే  నవతరమై విశ్వమంత చాటిస్తు
సమసమాజ  సారదులై  నవశఖాన వారదులై
ప్రపంచ భవితకు యువతే ప్రభంజనం మ్రొగిస్తూ....//లేవండి//

 నవ్వుల జీవులు కొందరు శోఖపు బ్రతులు ఎందరో
దోపిడి దారులు కొందరు  శ్రమైక వారలు ఎందరో
అసమానత  సమాజాన   సమానత్వ సారథులై   //లేవండి//

మన పడతుల కన్నీరు ప్రవాహమై పారుతుంటే
అన్నదాత ఆక్రందన ఆకాశాన్నంటు తుంటే
నిరుద్యోగ వ్యథల గతులు కథలై అల్లుకుపోతే
//లేవండి//

జనొద్దరణ పేరుతో  ధనార్జనే స్వార్దం తో
రాజ్యమేలే రాబందుల అవినీతిల గుట్టు విప్పా
ఉద్యమ కెరటాలై లేవండి యువతర మై     మెరవండి// లేవండి//

అణచివేత , అంధకార  ఆదిలోనే త్రుంచివేయ
ఘడీల పాలన పైన  గునపాలై చీల్చుకుంటూ
సంకెళ్లను తెగ నరికే  గొడ్డండ్లై  లేవండి.//లేవండి//

గత కాలపు  పీడన పై   పోరాడిన యువతర మే
నవకాలపు చెక్కిలి పై చిరునవ్వులు చెక్కాలి
ప్రపంచ పరిణామాలకు కారణ మనమవ్వలి.
// లేవండి//.

 రచన ::  పురుషోత్తం సతీష్
              తెలంగాణ సాహితీ రాష్ట్ర కమిటీ సభ్యులు
               కరీంనగర్


0/Post a Comment/Comments