"అమ్మమ్మ కథల సొగసు" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

"అమ్మమ్మ కథల సొగసు" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

అమ్మమ్మ కథల సొగసు

నాటి అమ్మమ్మ కథలు రసవత్తరంగా వుండి
అనుభవంతో ఆశువుగా అల్లే కథలై
పిల్లలమేదస్సును పెంచే అద్భుత కథలు
చందమామ కథల్లోని ఆహ్లాదాన్ని
బేతాళుడి కథల్లోని విజ్ఞానాన్ని
దయ్యాలు భూతాలకథల్లోని భయాన్ని
ఆప్యాయతతో అనుబంధంతో
కథ కంచికి మనమింటికి అని
తెలియజెప్పి నిద్రబుచ్చడం
మరువలేని రోజులు

పిల్లాజెల్లలతో కళకళలాడే
ఉమ్మడి కుటుంబాలు నేడు
కరువై అమ్మమ్మ కథలకు దూరమై
ఆంగ్ల చదువులతో
చరవాణిల ఆటపాటలతో
తీరిక లేకుండా పోతున్న పిల్లలు
సొగసుగా వర్ణించి చెప్పే
అమ్మమ్మ కథలకు బహు దూరమై
వారి ప్రేమాభిమానాలకు నోచుకోని
దురదృష్టవంతులవుతున్నారు

ప్రతి తల్లితండ్రి దృష్టిపెట్టి
అమ్మమ్మ తాతయ్య అద్భుత కథలను
కాలానికి వదిలేయకుండా
పెద్దల లాలన పాలనను
కథల్లోని విజ్ఞానాన్ని పిల్లలకు
అందించడం మన కర్తవ్యం


ఆచార్య ఎం.రామనాథం నాయుడు
మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments