గరుడ పంచమి

గరుడ పంచమి


- మార్గం కృష్ణమూర్తి

గరుడ పంచమి

పవిత్ర 'శ్రావణ మాస' శుక్ల పంచమియే
జనులు కొలిచెదరు గరుడపంచమనియే
భవిష్యత్ పురాణంలో నుండెనొక గాథయే
అది చదివినను , విన్నను గొప్ప పుణ్యమే!

కశ్యప రాజుకు నుండిరి నిరువురు భార్యలు
ఆ ఇరువురు మహారాణులే కద్రువ వినతలు
సంతానం లేక గడిచే నెన్నో కాలములు
కశ్యపుడు పుత్రకామేష్ఠి యాగములు
చేయ, కలిగిరి సంతానం కద్రువకు నాగులు
మహారాణి వినతకు కలిగే నాగులు!

కద్రువ, ధవళ అశ్వ మోసపూరిత పందెమున
చేసే  వినితను , కుద్రువకు దాసి గాను
గరుడు నదియు భరించ లేక విముక్తి కోరే
అంతట పెద్దతల్లి , నాగుళ్ళు షరతు విధించే
దేవలోకం నుండి అమృతమును కొనిరమ్మనే!

గరుడు సమ్మతించి , స్వర్గం పయణించే
దేవలోకము నుండి అమృతం తెచ్చే
తల్లికి గరుడు దాస్య విముక్తిని గావించే
అట్టి శ్రావణ శుక్లపంచమిరోజే ,గరుడపంచమి!

గరుడ పంచమి రోజుయే , నాగుల పంచమి
ఈ రోజు వనితలు స్నాన మాచరించి
పాలు గ్రుడ్డు నైవేధ్యాలు , ధూప దీపాలతో
పుట్టలకు , నైవేధ్యాలు జరిపించి మ్రొక్కేరు
నాగ దోషాలు బాపమని,సంతానం కల్గాలని
ముత్తైదవుగా నిలుపమని, శుభాలు కల్గాలని!

ఓం తాక్ష్యాయ నమః! ఓం గరుడాయ నమః
ఓం వైన తేజాయ నమః! ఓం ఖగాయ నమః
ఓం ఖగేశ్వరాయ నమః!

అని పఠించిన చాలు తొలుగు నాగ దోషాలు
కలుగు నెన్నో శుభాలు జనులెల్లరు పొందాలి సుఖాలు!

మార్గం కృష్ణమూర్తి
హైదరాబాద్








0/Post a Comment/Comments