చీపురుపుల్ల‌ చిల్లిగవ్వ... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ ఊ

చీపురుపుల్ల‌ చిల్లిగవ్వ... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ ఊ

చీపురుపుల్ల‌ చిల్లిగవ్వ

నిన్న నీవు
ఈ లోకానికి
అతిథిగా ఇచ్చావు
ఏదో ఒక రోజు అకస్మాత్తుగా
రమ్మని ఆ పరమాత్మ నుండి
ఆఖరిపిలుపు అందగానే
ఆత్మను అద్దెగా చెల్లించి ఈ
కొంపను ఖళీచేసి వెళ్ళక తప్పదు

ఎంతటి బంధువర్గం మున్నా
ఎందరు రక్తసంబంధీకులున్నా
నీ వెంట ఎవరూరారు వచ్చినా కాటివరకే
నీ ప్రయాణం మాత్రం ఒంటరి ప్రయాణమే

నీవు కష్టపడి చెమటోడ్చి ఆర్జించి
భద్రంగా దాచుకున్న
నీ బ్యాంకు బాలెన్స్ ను కానీ
నీవు రోజు తిరిగే ఖరీదైన నీ కారును కానీ
కోట్ల ఖరీదైన నీ పాలరాతిభవనాన్ని కానీ
నీ చేతివేలికున్న బంగారు ఉంగరాన్ని కానీ

నీ చేతిలోని సెల్ ఫోన్ ను కానీ
నీ జేబులోని చిల్లిగవ్వను కాని‌ ఇంట్లోని
చీపురుపుల్లనుగాని నీవు పట్టుకుపోలేవు
నీకిష్టమైనదేదీ నీవు నీ వెంటబెట్టుకుపోలేవు
కారణం నాది నాది అనుకున్నదేదీ నీదికాదు

అందుకే
పైనుండి వచ్చిన ఆత్మ మళ్ళీ పరమాత్మలోకే
మట్టి నుండి వచ్చిన మనిషి తిరిగి మట్టిలోకే ఇదే
ఇదే ప్రకృతిధర్మం ఎవరికీ అంతుచిక్కని సృష్టిమర్మం

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502




 

0/Post a Comment/Comments