విప్లవ సృష్టికర్త .. నేతాజీ సుభాష్ చంద్రబోస్

విప్లవ సృష్టికర్త .. నేతాజీ సుభాష్ చంద్రబోస్


విప్లవ సృష్టికర్త .. నేతాజీ సుభాష్ చంద్రబోస్

నేతాజీ 23 జనవరి 1897 లో జన్మించారు. తండ్రి పేరు జానకి నాథ్, తల్లి పేరు ప్రభావతి దేవి. రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా పని చేసాడు. 11 సార్లు ఆంగ్లేయులు జైల్లో వేశారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులతో పోరాడడానికి  ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాడు. బోస్ భుజాని తటి  మాట్లాడే అధికారం ఒక హిట్లర్కి ఉందని చరిత్ర చెబుతోంది.  1944 జూలై 4 లో బర్మా లో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీ లో సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. మిలటరీ నుంచి వ్యతిరేకత ఎదురైనా సందర్భంలో బోస్ ఆజాద్ హిందు విప్లవాన్ని ప్రారంభించారు. ఈయన చాలా నిరసనలు నిరాహార దీక్షలు వ్యతిరేక చర్యలు చేశాడు. ఈయన మీ రక్తాన్ని ధార పోయండి మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. అనే నినాదాలతో యువతను ఉత్సాహపరిచాడు. సుభాష్ చంద్రబోస్ బిరుదు నేతాజీ. 1945 ఆగస్టు 18 నా సుభాష్ చంద్రబోస్ తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడనే వార్త ఉంది కానీ నీ శవం మాత్రం కనుగొనబడలేదు. 1985లో అయోధ్య దగ్గర్లో లో ఉన్న ఐదు బాద్ లో భగవాన్ జి అనే సన్యాసి మారు వేషంలో ఉన్నది బోస్ అని చాలామంది అన్నారు. యువతను ఉత్తేజపరిచిన స్వాతంత్ర సమరయోధుడు గా సుభాష్ చంద్రబోస్ ను పరిగణిస్తారు.
 
వర్త్య వెంకటేష్
వికారాబాద్
 

0/Post a Comment/Comments